జనసేనకు ఊహించని ఎదురుదెబ్బ.. ‘గ్లాస్’ పోయింది
తెలంగాణలో త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి గ్లాస్ గుర్తు తీసేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జనసేన తెలంగాణలో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, అంతకుముందు కూడా పోటీచేయలేదు. కానీ ఆ పార్టీ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో జనసేనతోపాటు పలు పార్టీల కామన్ గుర్తులను తొలగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నది. జనసేన(గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్ సిలిండర్), […]
తెలంగాణలో త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి గ్లాస్ గుర్తు తీసేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జనసేన తెలంగాణలో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, అంతకుముందు కూడా పోటీచేయలేదు. కానీ ఆ పార్టీ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో జనసేనతోపాటు పలు పార్టీల కామన్ గుర్తులను తొలగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నది.
జనసేన(గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్ గుర్తులను కోల్పోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన కనీసం 10 శాతం సీట్లకు కూడా అభ్యర్థులను పోటీకి నిలపలేదు. దీంతో ఆ పార్టీ గుర్తును రద్దు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్ పేర్కొన్నారు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. దీంతో ఆ పార్టీ కోరిక మేరకు పోటీ నుంచి తప్పుకున్నది. అయితే త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో పోటీచేయాలని జనసేన నిర్ణయించుకున్నది. ఈ మేరకు తమకు కామన్ గుర్తు కేటాయించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10 శాతం స్థానాల్లో కూడా పోటీచేయనందున కామన్ గుర్తు ఇవ్వలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జనసేనతో సహా ఇతరపార్టీలు 2025 నవంబర్ 18 వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని పేర్కొంది.