కత్రినా సేఫ్.. బాయ్ ఫ్రెండ్ కూడా

అభిమానుల కోసం గుడ్ న్యూస్ మోసుకొచ్చింది కత్రినా కైఫ్. కరోనాతో బాధపడుతూ కొన్నాళ్లుగా హోం క్వారంటైన్ లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బయటకొచ్చింది. తాజాగా నిర్వహించిన టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్. కొన్నాళ్ల కిందట కత్రినా బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు కూడా కరోనా సోకినట్టు కత్రినా ప్రకటించింది. రీసెంట్ గా విక్కీ కౌశల్ […]

Advertisement
Update:2021-04-17 14:22 IST

అభిమానుల కోసం గుడ్ న్యూస్ మోసుకొచ్చింది కత్రినా కైఫ్. కరోనాతో బాధపడుతూ కొన్నాళ్లుగా హోం
క్వారంటైన్ లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బయటకొచ్చింది. తాజాగా నిర్వహించిన టెస్టులో తనకు నెగెటివ్
వచ్చిందని, ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్.

కొన్నాళ్ల కిందట కత్రినా బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు
తనకు కూడా కరోనా సోకినట్టు కత్రినా ప్రకటించింది. రీసెంట్ గా విక్కీ కౌశల్ నెగిటివ్ రిపోర్ట్ తో
బయటపడ్డాడు. ఈరోజు కత్రినా కూడా వైరస్ నుంచి కోలుకుంది.

అయితే కత్రినాకైఫ్ కోలుకున్నప్పటికీ ఆమె చేయాల్సిన సినిమాలు సెట్స్ పైకి వచ్చే పరిస్థితి లేదు.
ఎందుకంటే మహారాష్ట్రలో పాక్షిక లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా సినిమా షూటింగ్స్
ఆపేశారు. కాబట్టి కత్రినా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆమె ఇంటికే పరిమితం కాబోతోంది. ప్రస్తుతం
సూర్యవంశ్ అనే సినిమాలో నటిస్తోంది కత్రినాకైఫ్. దీంతో పాటు మరో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News