మళ్లీ తెరపైకి ఉప్పెన కాంబినేషన్
ఉప్పెన సినిమాతో స్టార్ డైరక్టర్ అయిపోయాడు బుచ్చిబాబు. మరోవైపు ఇదే సినిమాతో వైష్ణవ్ తేజ్ కూడా స్టార్ అయిపోయాడు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. అది కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే. ఉప్పెన సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు బుచ్చిబాబు. కథా చర్చలు కూడా మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా సగానికి పైగా పూర్తయింది. అయితే అంతలోనే కొరటాల ప్రాజెక్టు లాక్ చేశాడు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్టు […]
ఉప్పెన సినిమాతో స్టార్ డైరక్టర్ అయిపోయాడు బుచ్చిబాబు. మరోవైపు ఇదే సినిమాతో వైష్ణవ్ తేజ్ కూడా
స్టార్ అయిపోయాడు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. అది కూడా మైత్రీ మూవీ మేకర్స్
బ్యానర్ పైనే.
ఉప్పెన సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు బుచ్చిబాబు. కథా చర్చలు
కూడా మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా సగానికి పైగా పూర్తయింది. అయితే అంతలోనే కొరటాల
ప్రాజెక్టు లాక్ చేశాడు ఎన్టీఆర్.
దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్టు పక్కనపెట్టి, మరోసారి వైష్ణవ్ తేజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ
అవుతున్నాడు బుచ్చిబాబు. ఈసారి లవ్ సబ్జెక్ట్ తో పాటు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు ఈ
దర్శకుడు.