కోవిడ్ ఎఫెక్ట్ : ఇంతకూ జనం ఓటేయడానికి వస్తారా?

తెలంగాణ రాష్ట్రంలోని సాగర్​ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్​కు రేపు ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్​ శాతం ఎంత నమోదవుతుంది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్​ భయం ఎక్కువైంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో జనం భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు జనం ఓట్లు వేయడానికి ముందుకు వస్తారా? లేదా? అని రాజకీయపార్టీలు భయపడుతున్నాయట. నిన్న సాయంత్రంతోనే ప్రచారం ముగిసింది. […]

Advertisement
Update:2021-04-16 11:19 IST

తెలంగాణ రాష్ట్రంలోని సాగర్​ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్​కు రేపు ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్​ శాతం ఎంత నమోదవుతుంది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్​ భయం ఎక్కువైంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో జనం భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు జనం ఓట్లు వేయడానికి ముందుకు వస్తారా? లేదా? అని రాజకీయపార్టీలు భయపడుతున్నాయట.

నిన్న సాయంత్రంతోనే ప్రచారం ముగిసింది. దీంతో ఆయా పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. సాగర్​ అసెంబ్లీ సెగ్మెంట్​లో ఓటుకు మూడు వేల నుంచి ఐదువేల వరకు పంచుతున్నట్టు సమాచారం. ప్రజలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మద్యం సీసాలైతే ఏరులై పారుతున్నాయి. పలు చోట్ల వివిధ పార్టీల అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా చీరలుపంచుతున్నారు. సాగర్​లో ఓ ప్రధాన పార్టీ డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్నట్టు సమాచారం. ప్రతి వ్యక్తికి ఓ ఫుల్​ బాటిల్​, రెండు కేజీల మటన్​, ఓటుకు మూడు వేల నుంచి ఐదువేల వరకు పంచుతున్నట్టు సమాచారం.

ఇక తిరుపతిలోనూ అధికార ప్రతిపక్షాలు ప్రలోభ పర్వానికి తెరలేపాయి. అన్ని గ్రామాల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారు. అయితే డబ్బులు తీసుకున్న జనం పోలింగ్​ కేంద్రానికి వస్తారా? లేదా? అని నాయకులకు భయం పట్టుకున్నదట.

గ్రామస్థాయిలో నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో వాళ్లు ప్రస్తుతం డబ్బు, మద్యం పంచుతున్నారు. రేపు పోలింగ్​ కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యత కూడా వాళ్ల మీదే పెట్టారట అగ్రనేతలు. రేపు ఎంత పోలింగ్​ నమోదవుతుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News