ఇటు కరోనా.. అటు మహేష్ మూవీ
ఓవైపు కరోనాతో సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయి. విడుదలలు వాయిదా పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఫ్రెష్ గా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. అవును.. మహేష్ హీరోగా సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ […]
ఓవైపు కరోనాతో సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయి. విడుదలలు వాయిదా పడుతున్నాయి. ఇలాంటి
టైమ్ లో ఫ్రెష్ గా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. అవును.. మహేష్ హీరోగా సర్కారువారి పాట
కొత్త షెడ్యూల్ మొదలైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ
చిత్రం ‘సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు
సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఈ మూవీ ఇటీవల దుబాయ్‌లో నెలరోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఆ షెడ్యూల్ తర్వాత ఈ రోజు
(ఏప్రిల్ 13) ఉగాది పర్వదినం రోజున హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించింది చిత్ర యూనిట్.
ఈ షెడ్యూల్ ఈనెలాఖరు వరకూ కంటిన్యూగా జరుగుతుంది.
మహేష్‌బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తోన్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని
2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.