మేజర్ టీజర్ రివ్యూ

ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా వస్తోంది మేజర్. అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజై అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. మేజర్ సందీప్ గా అడివి శేష్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, హాలీవుడ్ టేకింగ్, మెస్మరైజింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. నిమిషం ముప్పై నాలుగు సెకన్ల […]

Advertisement
Update:2021-04-12 13:50 IST

ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా వస్తోంది మేజర్.
అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజై అందర్నీ ఎట్రాక్ట్
చేసింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. మేజర్ సందీప్ గా అడివి శేష్ అద్భుతమైన
పెర్ఫార్మెన్స్, హాలీవుడ్ టేకింగ్, మెస్మరైజింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా
నిలిచాయి.

నిమిషం ముప్పై నాలుగు సెకన్ల నిడివి కలిగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
టీజర్ ప్రారంభంలో మంటల్లో నిలుచున్న శేష్ షాట్ తో “మేజర్ సందీప్… డూ యు కాపీ మీ” అంటూ
బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ లో వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ , శ్రీ
చరణ్ పాకాల స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

సోల్జర్ అంటే ఏమిటి అనే థీమ్ తో టీజర్ ని కట్ చేసి సినిమాలో ఉన్న కంటెంట్ తెలియజేస్తూ మేజర్
ఉన్ని కృష్ణన్ చేసిన సాహసం గురించి క్రిస్పీగా చెప్పారు మేకర్స్. శేష్ తో పాటు సినిమాలో నటించిన
మిగతా నటుల క్యారెక్టర్స్ కూడా టీజర్ లో రివీల్ చేశారు. ప్రకాష్ రాజ్ , మురళి శర్మ , రేవతి సినిమాలో కీ
రోల్స్ లో కనిపించనున్నారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఉందని
చెప్తూ కొన్ని రొమాంటిక్ షాట్స్ కూడా చొప్పించారు. జులై 2న థియేటర్లలోకి రాబోతున్నాడు మేజర్ సందీప్.

Full View

Tags:    
Advertisement

Similar News