బాలయ్య సినిమా టైటిల్ వస్తోంది?

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ టైటిల్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయబోతున్నారు. బాలయ్యకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఏ పని చేసినా ముహూర్తం చూసి చేయడం ఆయనకు అలవాటు. తన కొత్త సినిమా టైటిల్ కోసం కూడా ఆయన ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 13 ఉగాది రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నారు. బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి ఇప్పటికే […]

Advertisement
Update:2021-04-11 13:22 IST

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ టైటిల్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయబోతున్నారు. బాలయ్యకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఏ పని చేసినా ముహూర్తం చూసి చేయడం ఆయనకు అలవాటు. తన కొత్త సినిమా టైటిల్ కోసం కూడా ఆయన ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 13 ఉగాది రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నారు.

బాలయ్య-బోయపాటి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. బాలయ్య లుక్ ఎలా ఉండబోతోందనే విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఈసారి టైటిల్ తో పాటు హీరోహీరోయిన్ల స్టిల్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు సింహా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టొచ్చింది. ఆ తర్వాత సింహాను మించిన రేంజ్ లో లెజెండ్ అనే మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడీ రెండు సినిమాల్ని క్రాస్ చేసేలా హ్యాట్రిక్ మూవీ వస్తుందని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్ల అంచనాల్ని అందుకునేలా టైటిల్ పెట్టడంతో పాటు, సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేశాడు దర్శకుడు బోయపాటి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News