తాజ్ హోటల్ లో బందీగా హీరోయిన్

ముంబయి తాజ్ హోటల్ పై ఉగ్ర దాడి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఘటనను బ్యాక్ డ్రాప్ గా తీసుకొని, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని మేజర్ సినిమాగా తీసుకొస్తున్నాడు అడివి శేష్. శిశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే పలు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ముందుగా మేజర్ సందీప్ గా అడివి శేష్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. […]

Advertisement
Update:2021-04-10 11:09 IST

ముంబయి తాజ్ హోటల్ పై ఉగ్ర దాడి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఘటనను బ్యాక్ డ్రాప్ గా తీసుకొని, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని మేజర్ సినిమాగా తీసుకొస్తున్నాడు అడివి శేష్.
శిశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే పలు ఫస్ట్ లుక్స్ రిలీజ్
చేశారు.

ముందుగా మేజర్ సందీప్ గా అడివి శేష్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఫస్ట్
లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో కీలక పాత్రధారి శోభిత ధూలిపాళ్ల లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

26/11 దురదృష్టకర ఉగ్రవాద దాడుల సమయంలో హోటల్ తాజ్ వద్ద చిక్కుకున్న ఎన్ఆర్ఐ బందీ
పాత్రలో శోభితా ధూళిపాల నటించారు. ఈ పోస్టర్ ఈ చిత్రం యొక్క అతి ముఖ్యమైన సన్నివేశాలలో
ఒకటిగా తెలుస్తోంది. తాజ్ హోటల్ లో బందీగా ఉన్న అమ్మాయి వేదనను శోభిత పాత్రతో
చూపించబోతున్నారు.

తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం
వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో
నటించారు. జులై 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతోంది మేజర్.

Tags:    
Advertisement

Similar News