నాగచైతన్య సినిమా మళ్లీ వాయిదా

రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న లవ్ స్టోరీ సినిమా మరోసారి వాయిదాబాట పట్టింది. లెక్కప్రకారం ఈనెల 16న ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. అయితే సినిమా రావడం లేదు. మరో మంచి తేదీ చూసి విడుదల చేస్తామని మాత్రమే మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 2019లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అప్పట్లో కొత్త నటీనటులతో ఈ సినిమా తీశాడు శేఖర్ కమ్ముల. […]

Advertisement
Update:2021-04-08 15:06 IST

రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న లవ్ స్టోరీ సినిమా మరోసారి వాయిదాబాట పట్టింది. లెక్కప్రకారం
ఈనెల 16న ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. అయితే సినిమా రావడం లేదు. మరో మంచి తేదీ చూసి
విడుదల చేస్తామని మాత్రమే మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కరోనా కేసుల్ని
దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

2019లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అప్పట్లో కొత్త నటీనటులతో ఈ సినిమా తీశాడు శేఖర్ కమ్ముల. ఆ
అవుట్ పుట్ నచ్చక సినిమా ఆపేశాడు. ఆ తర్వాత నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా
స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా కరోనా వచ్చింది. దీంతో సినిమా మరో ఏడాది ఆలస్యమైంది.

అలా పడుతూలేస్తూ సాగుతున్న సినిమా ఇప్పుడు ఇంకోసారి వాయిదాపడింది. వీలైతే ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉంది.

ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేయడానికి మరో కారణం కూడా ఉంది. లవ్ స్టోరీని భారీ ఎత్తున విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన. కాకపోతే ఈ సినిమాకు ముందుగా వకీల్ సాబ్ ఉంది. వారం రోజులకే వకీల్ సాబ్ థియేటర్లు ఖాళీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలా అన్ని విధాలుగా ఆలోచించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

Tags:    
Advertisement

Similar News