మార్స్‌పై హెలికాప్టర్ ఎగురుతుందా?

ఫిబ్రవరి 18వ తేదీన మార్స్‌పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ తనతో పాటు ఓ హెలికాప్టర్ ను కూడా వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.. ‘ఇన్ జెన్యూయిటీ’ అనే ఈ మినీ హెలికాప్టర్ ఇప్పుడు మార్స్‌పై దిగింది. మరి ఇది మార్స్ గగన తలంలో ఎగురగలుగుతుందా? పర్సీవరెన్స్ రోవర్ తో పాటు మార్స్‌కు వెళ్లిన హెలికాప్టర్.. రోవర్ నుంచి మార్స్ ఉపరితలంపై దిగిందని నాసా వెల్లడించింది. అయితే ఇది మనుగడ సాగిస్తుందా ? లేదా ? అనేది ఇప్పుడు […]

Advertisement
Update:2021-04-07 08:26 IST

ఫిబ్రవరి 18వ తేదీన మార్స్‌పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ తనతో పాటు ఓ హెలికాప్టర్ ను కూడా వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే.. ‘ఇన్ జెన్యూయిటీ’ అనే ఈ మినీ హెలికాప్టర్ ఇప్పుడు మార్స్‌పై దిగింది. మరి ఇది మార్స్ గగన తలంలో ఎగురగలుగుతుందా?

పర్సీవరెన్స్ రోవర్ తో పాటు మార్స్‌కు వెళ్లిన హెలికాప్టర్.. రోవర్ నుంచి మార్స్ ఉపరితలంపై దిగిందని నాసా వెల్లడించింది. అయితే ఇది మనుగడ సాగిస్తుందా ? లేదా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వచ్చే రెండు రోజుల పాటు ఇంజెన్యూయిటీ టీమ్ ఈ హెలికాప్టర్ కు అమర్చిన సోలార్ ప్యానెల్స్ ను చెక్ చేయనుంది. తర్వాత బ్యాటరీని రీఛార్జ్ చేసి, ఈనెల 11వ తేదీన ఈ హెలికాప్టర్ ను ఎగురవేసే ప్రయత్నం చేయనున్నారు. భూమి సాంద్రతలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న మార్స్‌పై ఇది ఎగరడం అంత సులువు కాదంటున్నారు నిపుణులు. దాంతో పాటు మార్స్ రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్స్ పడిపోతాయని, ఇలాంటి వాతావరణంలో మనుగడ సాగించడం కొంత కష్టమేనని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే మొత్తానికి 11వ తేదీన ఫస్ట్ అటెంప్ట్ లో భాగంగా పది అడుగుల మేర పైకి ఎగిరి, 30 సెకన్ల పాటు అక్కడే ఉండి తిరిగి కిందకు దిగనుంది. ఇది ఎంతమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News