బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్

ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయంతో ఊహించని ఆఫర్ అందుకున్నాడు ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే నచ్చితే, ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం గ్యారెంటీ. ఉప్పెన సక్సెస్ తర్వాత మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే సినిమా చేయబోతున్నాడు బుచ్చిబాబు. ఈ మేరకు ఉప్పెన టైమ్ లోనే బుచ్చిబాబుకు అడ్వాన్స్ ఇచ్చి రిజర్వ్ చేసుకున్నారు […]

Advertisement
Update:2021-04-07 14:53 IST

ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయంతో ఊహించని ఆఫర్ అందుకున్నాడు ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే నచ్చితే, ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం గ్యారెంటీ.

ఉప్పెన సక్సెస్ తర్వాత మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే సినిమా చేయబోతున్నాడు బుచ్చిబాబు. ఈ మేరకు ఉప్పెన టైమ్ లోనే బుచ్చిబాబుకు అడ్వాన్స్ ఇచ్చి రిజర్వ్ చేసుకున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్టు ఫైనల్ అయితే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే సినిమా వస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా పని మీదే బుచ్చిబాబు ఉన్నాడు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సినిమాకు స్క్రీన్ ప్లే రాసే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్-బుచ్చిబాబు మధ్య 2సార్లు స్టోరీ డిస్కషన్లు జరిగాయి.

అన్నట్టు ఈ ప్రాజెక్టు ఫైనల్ అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయాల్సిన సినిమా ఇంకొన్నాళ్లు ఆలస్యమౌతుంది. బుచ్చిబాబు సినిమానే ముందుగా సెట్స్ పైకి వస్తుంది.

Tags:    
Advertisement

Similar News