మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్

మహేష్ కు, త్రివిక్రమ్ కు గొడవలయ్యాయంటారు కొంతమంది. ఇద్దరూ మాటకుమాట అనుకున్నారని, అప్పట్నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్నారని అంటారు. కారణాలు ఏదైతేనేం ఇద్దరూ కలిసి 11 ఏళ్లుగా సినిమాలు చేయలేదు. ఖలేజానే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చివరి సినిమా. అలా దశాబ్దానికి పైగా కలవని ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు కలవబోతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా రాబోతోంది. లెక్కప్రకారం ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ […]

Advertisement
Update:2021-04-07 14:56 IST

మహేష్ కు, త్రివిక్రమ్ కు గొడవలయ్యాయంటారు కొంతమంది. ఇద్దరూ మాటకుమాట అనుకున్నారని, అప్పట్నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్నారని అంటారు. కారణాలు ఏదైతేనేం ఇద్దరూ కలిసి 11 ఏళ్లుగా సినిమాలు చేయలేదు. ఖలేజానే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చివరి సినిమా. అలా దశాబ్దానికి పైగా కలవని ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు కలవబోతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సినిమా రాబోతోంది.

లెక్కప్రకారం ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఆ సినిమా ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే టైమ్ లో నమ్రత శిరోద్కర్ మధ్యవర్తిత్వంతో త్రివిక్రమ్-మహేష్ కలిశారు. అలా ఈ గ్యాప్ లో మహేష్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడట త్రివిక్రమ్.

ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నాడు త్రివిక్రమ్. హోమ్ క్వారంటైన్ లో ఉంటూనే మహేష్ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్నట్టు ఈ ప్రాజెక్టులోకి పూజా హెగ్డేను సైతం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News