జాతిరత్నాలు మళ్లీ వస్తున్నారు
రీసెంట్ గా సూపర్ హిట్టయిన సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి. ఈ మూవీని సూపర్ హిట్ అనడం కంటే బ్లాక్ బస్టర్ అనడం కరెక్ట్. జస్ట్ 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలు ఆర్జించిందంటే.. ఏ రేంజ్ హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ సినిమా మరోసారి అలరించబోతోంది. అవును.. ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్ పై నవ్వులు పూయించిన జాతిరత్నాలు, ఇప్పుడు ఓటీటీ వేదికగా మరింత మందికి నవ్వులు పంచబోతున్నారు. […]
రీసెంట్ గా సూపర్ హిట్టయిన సినిమాల్లో జాతిరత్నాలు ఒకటి. ఈ మూవీని సూపర్ హిట్ అనడం కంటే బ్లాక్ బస్టర్ అనడం కరెక్ట్. జస్ట్ 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలు ఆర్జించిందంటే.. ఏ రేంజ్ హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ సినిమా మరోసారి అలరించబోతోంది.
అవును.. ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్ పై నవ్వులు పూయించిన జాతిరత్నాలు, ఇప్పుడు ఓటీటీ వేదికగా మరింత మందికి నవ్వులు పంచబోతున్నారు. ఈనెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో జాతిరత్నాలు సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.
ఈ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. వెండితెరపై బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ అందర్నీ మెప్పిస్తుందంటూ స్వప్న సినిమాస్ ప్రకటించుకుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ చానెల్ దక్కించుకుంది. త్వరలోనే జెమినీ టీవీలో సినిమా టెలికాస్ట్ తేదీని ప్రకటించబోతున్నారు.