చిరంజీవి ఈసారి కూడా అంతే!

చిరంజీవి నుంచి ఈ ఏడాది కచ్చితంగా 2 సినిమాలు వస్తాయని, ఈ ఇయర్ ప్రారంభంలో మెగాఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. దీనికి కారణం అప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ 60శాతం పూర్తవ్వడంతో పాటు లూసిఫర్ సినిమాకు ముహూర్తం కూడా జరిగిపోయింది. అయితే 3 నెలలు గడిచేసరికి అసలు రూపం బయటపడింది. చిరంజీవి నుంచి ఎప్పట్లానే ఈ ఏడాది ఒక సినిమానే వస్తుందనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఆచార్య సినిమా మరింత ఆలస్యమైంది. షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. […]

Advertisement
Update:2021-04-06 15:33 IST

చిరంజీవి నుంచి ఈ ఏడాది కచ్చితంగా 2 సినిమాలు వస్తాయని, ఈ ఇయర్ ప్రారంభంలో మెగాఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. దీనికి కారణం అప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ 60శాతం పూర్తవ్వడంతో పాటు లూసిఫర్ సినిమాకు ముహూర్తం కూడా జరిగిపోయింది. అయితే 3 నెలలు గడిచేసరికి అసలు రూపం బయటపడింది. చిరంజీవి నుంచి ఎప్పట్లానే ఈ ఏడాది ఒక సినిమానే వస్తుందనే విషయంపై స్పష్టత వచ్చేసింది.

ఆచార్య సినిమా మరింత ఆలస్యమైంది. షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. పనులు పూర్తవ్వడానికి మరో 10 రోజులు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలకు సినిమా రెడీ కాదంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం లూసిఫర్ పై గట్టిగా పడింది.

పోనీ ఆచార్యతో సమాంతరంగా లూసిఫర్ ను ప్రారంభిద్దామంటే.. ఈ సినిమాకు నటీనటుల సమస్య ఎదురైంది. ఫిబ్రవరిలో ఓకే చెప్పిన నటులంతా ఇప్పుడు కాల్షీట్లు లేవంటున్నారు. దీంతో లూసిఫర్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

సినిమాకు నటీనటుల్ని ఎంపిక చేసి, షూటింగ్ పూర్తయ్యేసరికి ఈ ఏడాది గడిచిపోవడం ఖాయం. సో.. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా చిరంజీవి నుంచి ఒక సినిమానే.

Tags:    
Advertisement

Similar News