కత్రినా కైఫ్ కు కరోనా

బాలీవుడ్ లో వరుసగా హీరోహీరోయిన్లు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికిమొన్న హీరోయిన్ అలియాభట్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉంది. ఇప్పుడు తాజాగా కత్రినాకైఫ్ కరోనా బారిన పడింది. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని కత్రినా స్వయంగా నిర్థారించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ జంటగా కొనసాగుతున్నారు కత్రినా-విక్కీ కౌశల్. వీళ్లిద్దరి డేటింగ్ వ్యవహారం అక్కడ బహిరంగ రహస్యం. విక్కీ కౌశల్ తాజాగా కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా సోకిన […]

Advertisement
Update:2021-04-06 15:34 IST

బాలీవుడ్ లో వరుసగా హీరోహీరోయిన్లు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికిమొన్న హీరోయిన్ అలియాభట్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉంది. ఇప్పుడు తాజాగా కత్రినాకైఫ్ కరోనా బారిన పడింది. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని కత్రినా స్వయంగా నిర్థారించింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ జంటగా కొనసాగుతున్నారు కత్రినా-విక్కీ కౌశల్. వీళ్లిద్దరి డేటింగ్ వ్యవహారం అక్కడ బహిరంగ రహస్యం. విక్కీ కౌశల్ తాజాగా కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా సోకిన 24 గంటల వ్యవథిలోనే తనకు కూడా కరోనా సోకినట్టు కత్రినా ప్రకటించింది. దీంతో ఈ మేటర్ హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు కరోనాతో బాధపడుతున్న అక్షయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ లో అనుమానాలు పొడసూపుతున్నాయి. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించిన అక్షయ్ కుమార్, నిన్నటివరకు హోం ఐసొలేషన్ లో ఉన్నాడు. ఈరోజు ఉన్నట్టుండి హఠాత్తుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

Tags:    
Advertisement

Similar News