రిపబ్లిక్ మూవీ టీజర్ రివ్యూ
సాయి ధరం తేజ్ – దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రిపబ్లిక్’ మూవీ టీజర్ రిలీజైంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. “ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చేయలేం” అంటూ జార్జ్ ఆర్వెల్ కోట్ తో టీజర్ ను మొదలు పెట్టిన దేవకట్టా సినిమాలో ఉండే ఇంటెన్స్ పోలిటికల్ డ్రామాను క్రిస్పీ గా చూపిస్తూ సినిమాపై అంచనాలు పెంచాడు. ముఖ్యంగా […]
సాయి ధరం తేజ్ – దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రిపబ్లిక్’ మూవీ టీజర్ రిలీజైంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు.
“ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చేయలేం” అంటూ జార్జ్ ఆర్వెల్ కోట్ తో టీజర్ ను మొదలు పెట్టిన దేవకట్టా సినిమాలో ఉండే ఇంటెన్స్ పోలిటికల్ డ్రామాను క్రిస్పీ గా చూపిస్తూ సినిమాపై అంచనాలు పెంచాడు. ముఖ్యంగా ‘ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు..అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం… కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాది అని తెలియకుండానే ఇంకా ఫ్యునల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం’ అంటూ తేజ్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది.
సినిమాలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలిటీషియన్ క్యారెక్టర్ లో కనిపించనుందని టీజర్ లో షాట్స్ చూస్తే అర్థమవుతుంది. ”వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్” అంటూ తేజ్ చివర్లో చెప్పే డైలాగ్ వింటే సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అవినీతి గురించి దేవకట్టా.. తేజ్ క్యారెక్టర్ తో మాట్లాడించినట్టు తెలుస్తుంది.
తేజ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ చూస్తుంటే అతని కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ లో ఇది కూడా చేరనుందనిపిస్తుంది. ఓవరాల్ గా టీజర్ తో ‘రిపబ్లిక్’ లో చూపించబోతున్న కంటెంట్ గురించి క్లియర్ కట్ గా చెప్పాడు దేవకట్టా. జీ స్టూడియోస్ తో కలిసి భగవాన్ , పుల్లారావు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. జూన్ 4న థియేటర్స్ లోకి రానుంది.