టాక్ ఆఫ్ తమిళ నాడు.. కమల్, కుష్బూ..

తమిళనాడు ఎన్నికల పర్వంలో రెండే రెండు నియోజకవర్గాలు రోజూ వార్తల్లోకెక్కుతున్నాయి. ప్రచార పర్వాన్ని ఈ సీనియర్ నటులు, అభ్యర్థులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కి మద్దతుగా చిన్న కుమార్తె అక్షర హాసన్, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె, మరో ప్రముఖ న‌టి సుహాసిని ప్రచారంలో పాల్గొంటున్నారు. డ్యాన్స్ లతో సందడి చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కమల్ హాసన్ ఎక్కడికెళ్లినా ప్రజలు ఆయన్ను చూడటానికి గుమికూడటంతో ప్రచార పర్వం ఆకట్టుకునేలా […]

Advertisement
Update:2021-04-04 11:36 IST

తమిళనాడు ఎన్నికల పర్వంలో రెండే రెండు నియోజకవర్గాలు రోజూ వార్తల్లోకెక్కుతున్నాయి. ప్రచార పర్వాన్ని ఈ సీనియర్ నటులు, అభ్యర్థులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కి మద్దతుగా చిన్న కుమార్తె అక్షర హాసన్, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె, మరో ప్రముఖ న‌టి సుహాసిని ప్రచారంలో పాల్గొంటున్నారు. డ్యాన్స్ లతో సందడి చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కమల్ హాసన్ ఎక్కడికెళ్లినా ప్రజలు ఆయన్ను చూడటానికి గుమికూడటంతో ప్రచార పర్వం ఆకట్టుకునేలా సాగుతోంది. అందులోనూ కమల్ పోటీ చేస్తున్న కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే రెండూ పోటీలో లేవు. పొత్తుల్లో భాగంగా ఆయా సీట్లలో ప్రధాన కూటముల తరపున కాంగ్రెస్, బీజేపీ తలపడుతున్నాయి. దీంతో కమల్ హాసన్ విజయంపై ధీమాగా ఉన్నారు.

విమర్శలు కూడా..
కమల్ హాసన్ తో సహజీవనం చేసి, విడిపోయిన గౌతమి ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గౌతమి.. కమల్ ని నేరుగా టార్గెట్ చేశారు. ప్రజలను మభ్యపెట్టడం కోసం కమల్ హాసన్ మార్కెటింగ్ మాయాజాలాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

కుష్బూ ప్రచార జోరు..
అటు చెన్నైలోని థౌజంట్ లైట్స్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కుష్బూ కూడా తమిళనాడు ఎన్నికలకు సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యారు. వాస్తవానికి కుష్బూని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలనుకుంది బీజేపీ. కానీ ఆమె పట్టుబట్టి మరీ థౌజండ్ లైట్స్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. డీఎంకేలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా తనకు సరైన న్యాయం జరగలేదని, బీజేపీ తనను గుర్తించి టికెట్ ఇచ్చిందని అంటున్నారు కుష్బూ. ఎలాగైనా బీజేపీ తరపున తమిళనాడు అసెంబ్లీలో తొలి అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కుష్బూ ప్రచారం కూడా విభిన్నంగా సాగుతోంది. దోశలు పోస్తూ, పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ, టీకొట్లు, కూరగాయల మార్కెట్లు.. ఇలా ప్రతి చోటా ఆమె సామాన్యుల్ని పలకరిస్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులో ప్రచారానికి వచ్చిన అమిత్ షా కూడా.. కుష్బూ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారంటే.. ఆమెకు పార్టీ ఇస్తున్న ప్రయారిటీ అర్థం చేసుకోవచ్చు. అయితే థౌజంట్ లైట్స్ నియోజకవర్గం డీఎంకేకి పెట్టని కోట. ప్రతిపక్ష నేత స్టాలిన్ గతంలో అక్కడినుంచి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కూడా డీఎంకే అభ్యర్థే అక్కడ గెలిచారు. ఈసారి అన్నాడీఎంకే ఆ స్థానాన్ని బీజేపీకి వదిలేసింది. కుష్బూ రాకతో థౌజండ్ లైట్స్ లో డీఎంకే విజయానికి బ్రేక్ పడుతుందని ఆశిస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ బరిలో చాలామంది సినీ తారలు బరిలో ఉన్నా.. లోక నాయకుడిగా పేరున్న కమల్ హాసన్, అందాల తారగా గుడి కట్టి మరీ తమిళ అభిమానులు ఆరాధించిన కుష్బూ.. ఈ సారి స్టార్ అట్రాక్షన్ గా మారారు.

Tags:    
Advertisement

Similar News