సర్ ప్రైజ్ ఏంటో చెప్పిన వకీల్ సాబ్
వకీల్ సాబ్ సినిమా సెకెండాఫ్ లో ఓ బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని తమన్ ఇప్పటికే ప్రకటించాడు. ఆ సర్ ప్రైజ్ ఏంటనే విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా బయటపెట్టాడు. నిజంగానే అది సర్ ప్రైజ్ అంటున్నాడు. “పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు.” ఇలా వకీల్ సాబ్ సర్ ప్రైజ్ ఏంటనేది బయటపెట్టాడు […]
వకీల్ సాబ్ సినిమా సెకెండాఫ్ లో ఓ బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని తమన్ ఇప్పటికే ప్రకటించాడు. ఆ సర్ ప్రైజ్ ఏంటనే విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా బయటపెట్టాడు. నిజంగానే అది సర్ ప్రైజ్ అంటున్నాడు.
“పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు.”
ఇలా వకీల్ సాబ్ సర్ ప్రైజ్ ఏంటనేది బయటపెట్టాడు వేణుశ్రీరామ్. మరోవైపు లీక్ అయిన స్టిల్ ను ప్రచారంలో వాడుకోవడంపై కూడా స్పందించాడు.
“వకీల్ సాబ్ లోని ఒక స్టిల్ లీక్ చేశారు ఫ్యాన్స్. అది బాగుందని చూసి. ఆ స్టిల్ నే పోస్టర్ లో పెట్టాను. లాయర్ సాబ్, మగువా లోకానికి తెలుసా నీ విలువ లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం. మగువా మగువా అని పదాలు పెట్టాలని నేనే సూచించాను.”
ఈనెల 9న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది వకీల్ సాబ్. పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ ఇది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.