ఆచార్య ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
ఆచార్య ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీజర్ విడుదల కాగా.. ఇప్పుడు పాటలతో ప్రచారం స్టార్ట్ చేశారు. ముందుగా మణిశర్మ కంపోజ్ చేసిన లాహెలాహె అనే సాంగ్ ను విడుదల చేశారు. శివుడిపై రాసిన డిఫరెంట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఇలాంటి పాట పెట్టడాన్ని కాస్త సాహసంగానే చెప్పాలి. హైదరాబాద్ శివారు ప్రాంతం కోకాపేటలో వేసిన టెంపుల్ సెట్‌లో ఈ `లాహే లాహే..` సాంగ్‌ను చిత్రీకరించారు. పరమేశ్వరుడిని స్తుతిస్తూ […]
ఆచార్య ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీజర్ విడుదల కాగా.. ఇప్పుడు పాటలతో ప్రచారం స్టార్ట్ చేశారు.
ముందుగా మణిశర్మ కంపోజ్ చేసిన లాహెలాహె అనే సాంగ్ ను విడుదల చేశారు. శివుడిపై రాసిన
డిఫరెంట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో
ఇలాంటి పాట పెట్టడాన్ని కాస్త సాహసంగానే చెప్పాలి.
హైదరాబాద్ శివారు ప్రాంతం కోకాపేటలో వేసిన టెంపుల్ సెట్‌లో ఈ 'లాహే లాహే..' సాంగ్‌ను
చిత్రీకరించారు. పరమేశ్వరుడిని స్తుతిస్తూ ఈ పాటను పిక్చరైజ్ చేయగా, అందుకు తగినట్లు ప్రముఖ
లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. పరమేశ్వరుడి రూపాన్ని తన పాటతో
పొగుడుతూ దాన్ని మెగాస్టార్ చిరంజీవికి మ్యాచ్ అయ్యేలా రాయడం రామజోగయ్య శాస్త్రికే చెల్లింది.
మెగాస్టార్ డాన్స్‌కుండే క్రేజే వేరు. ఎలాంటి కష్టమైన స్టెప్‌నైనా అలవోకగానే కాదు.. అందంగానూ వేసే
మెగాస్టార్ ఈ సినిమాలో తనదైన డాన్సింగ్ చమక్కులు చూపించారు. మచ్చుకు ఈ లిరికల్ సాంగ్‌లో
చిన్న డాన్స్ బీట్ ఉంటుంది. ఈ పాటలో కాజల్, నటి సంగీత కూడా ఉండటం కొసమెరుపు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని ఈ పాటను హారిక నారాయణ్,
సాహితీ ఆలపించారు. ఫోక్ సాంగ్.. సెమీ క్లాసిక్ ఫార్మేట్‌లో కంపోజ్ చేసిన ఈ పాట అందర్నీ
ఆకట్టుకుంటోంది.