పవన్ చాలా క్లోజ్ అంటున్న హీరోయిన్
పవన్ కల్యాణ్ తనకు చాలా క్లోజ్ అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. పనన్ తో కలిసి వీరమల్లు అనే సినిమా చేస్తోంది నిధి. ఈ సినిమా ఫస్టాఫ్ లో మాత్రమే ఆమె హీరోయిన్ గా కనిపించనుంది. పవన్ తో ఓ సాంగ్ కూడా ఉంది. కేవలం 2 షెడ్యూల్స్ తో పవన్-నిధి అగర్వాల్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ తక్కువ టైమ్ లో తామిద్దరం చాలా క్లోజ్ అయిపోయామని అంటోంది నిధి సెట్స్ లోకి పవన్ వస్తే […]
పవన్ కల్యాణ్ తనకు చాలా క్లోజ్ అంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. పనన్ తో కలిసి వీరమల్లు అనే
సినిమా చేస్తోంది నిధి. ఈ సినిమా ఫస్టాఫ్ లో మాత్రమే ఆమె హీరోయిన్ గా కనిపించనుంది. పవన్ తో ఓ
సాంగ్ కూడా ఉంది. కేవలం 2 షెడ్యూల్స్ తో పవన్-నిధి అగర్వాల్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ
తక్కువ టైమ్ లో తామిద్దరం చాలా క్లోజ్ అయిపోయామని అంటోంది నిధి
సెట్స్ లోకి పవన్ వస్తే ఓ రకమైన ఎనర్జీ వస్తుందని చెబుతోంది నిధి. పవన్ అడుగు పెట్టిన వెంటనే
యూనిట్ లో అంతా తమ పనులు పక్కనపెట్టి మరీ పవన్ ను అలా చూస్తూ ఉండిపోతారని చెబుతోంది
నిధి.
ఇక తన విషయానికొస్తే పవన్ ను చూసి చాలా నేర్చుకున్నానని చెబుతోంది ఈ బ్యూటీ. ఓ సీన్ ను ఎలా
చేయాలో పవన్ కు బాగా తెలుసని, సహ నటుడు లేదా నటికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారని చెబుతోంది. ఏదైనా
సీన్ కు సంబంధించి రిహార్సల్స్ చేయాల్సి వస్తే 2-3 సార్లు రిహార్సల్స్ చేయడానికి పవన్ వెనకాడ్డని
చెబుతోంది.