ఈ హీరో కూడా 3 సినిమాలు

ఈ ఏడాది చాలామంది హీరోలు మూడేసి సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రేసులో నితిన్ లాంటి హీరోలు కాస్త ముందున్నారు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా ఈ రేసులోకి ఎంటరయ్యాడు హీరో విశ్వక్ సేన్. ఈ హీరో కూడా ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేస్తానంటున్నాడు. “`ప్రాజెక్ట్ గామీ` షూటింగ్ పూర్త‌య్యింది. క్లాసిక్ అడ్వెంచ‌ర్ డ్రామా అది. డిఫ‌రెంట్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఆ సినిమాలో సీజీ వ‌ర్క్ ఎక్కువ ఉంది. […]

Advertisement
Update:2021-03-29 08:08 IST

ఈ ఏడాది చాలామంది హీరోలు మూడేసి సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రేసులో నితిన్ లాంటి హీరోలు కాస్త ముందున్నారు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా ఈ రేసులోకి ఎంటరయ్యాడు హీరో విశ్వక్ సేన్. ఈ హీరో కూడా ఈ ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేస్తానంటున్నాడు.

“'ప్రాజెక్ట్ గామీ' షూటింగ్ పూర్త‌య్యింది. క్లాసిక్ అడ్వెంచ‌ర్ డ్రామా అది. డిఫ‌రెంట్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఆ సినిమాలో సీజీ వ‌ర్క్ ఎక్కువ ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి మ‌‌రో ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. అలాగే పివిపి బ్యాన‌ర్‌లో ఒక సినిమా చేస్తున్నా..అది ఏప్రిల్ 3నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత బీవిఎస్ఎన్ ప్ర‌సాద్‌గారితో ఒక సినిమా ఉంది. పాగల్ తో కలిపి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.”

ప్రస్తుతం ఈ హీరో పాగల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు పాగల్ అనే టైటిల్ పెట్టడం వెనక రీజన్ ను బయటపెట్టాడు.

“ఇప్ప‌టివ‌ర‌కూ నేను ఒక‌దానితో ఒక‌టి సంభందం లేకుండా విభిన్న క‌థాంశాల‌తో సినిమాలు చేశాను. ఇప్పుడు పాగ‌ల్ సినిమా కూడా ఒక కొత్త ప్ర‌య‌త్నం. ప్రేమించేట‌ప్పుడు కొంత‌మంది పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ కూడా అలానే ఉంటుంది, అందుకే ఈ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. మా టీమ్ అంద‌రం క‌లిసి తీసుకున్న నిర్ణ‌యం అది.”

మరో వైపు హిట్ సినిమా సీక్వెల్ పై కూడా స్పందించాడు విశ్వక్. సీక్వెల్ నుంచి తనను తొలిగింలేదని, కాల్షీట్లు ఎడ్జెస్ట్ కాలేకపోవడంతో హిట్-2 నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చాడు.

Tags:    
Advertisement

Similar News