రంగ్ దే మొదటి వారాంతం వసూళ్లు
ఎట్టకేలకు చెక్ పరాజయం నుంచి బయటపడ్డాడు నితిన్. రంగ్ దే సినిమా ఈ హీరోకు ఓ హిట్ అందించింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా మెల్లగా ఊపందుకుంది. మొదటి 3 రోజులు ఈ సినిమాకు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 12.47 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అయితే వసూళ్లు బాగున్నప్పటికీ […]
ఎట్టకేలకు చెక్ పరాజయం నుంచి బయటపడ్డాడు నితిన్. రంగ్ దే సినిమా ఈ హీరోకు ఓ హిట్ అందించింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా మెల్లగా ఊపందుకుంది. మొదటి 3 రోజులు ఈ సినిమాకు డీసెంట్ వసూళ్లు వచ్చాయి.
ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 12.47 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అయితే వసూళ్లు బాగున్నప్పటికీ ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనేది అనుమానాస్పదంగా మారింది.
వరల్డ్ వైడ్ ఈ సినిమాను 24 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. సో.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమాకు ఇంకా 12 కోట్ల రూపాయలు కావాలి. హోలీ కూడా కలిసి రావడంతో సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యేలా ఉంది. ఇక ఏపీ,నైజాంలో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్లు) ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 3.79 కోట్లు
సీడెడ్ – రూ. 1.66 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.30 కోట్లు
ఈస్ట్ – రూ. 0.85 కోట్లు
వెస్ట్ – రూ. 0.57 కోట్లు
గుంటూరు – రూ. 1.09 కోట్లు
కృష్ణా – రూ. 0.65 కోట్లు
నెల్లూరు – రూ. 0.44 కోట్లు