వకీల్ సాబ్ టైమ్ చెప్పేశాడు

రేపు వకీల్ సాబ్ ట్రయిలర్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఇవాళ్టి నుంచే ట్రెండింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వకీల్ సాబ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్సే కనిపిస్తున్నాయి. మరి ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఆ ట్రయిలర్ ఏ టైమ్ కు రిలీజ్ అవుతుంది? ఇప్పుడా మేటర్ ను మేకర్స్ రివీల్ చేశారు. వకీల్ సాబ్ ట్రయిలర్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుంది. దిల్ రాజు యూట్యూబ్ ఛానెల్ పై ఈ ట్రయిలర్ […]

Advertisement
Update:2021-03-28 09:15 IST

రేపు వకీల్ సాబ్ ట్రయిలర్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఇవాళ్టి నుంచే ట్రెండింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వకీల్ సాబ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్సే కనిపిస్తున్నాయి. మరి ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఆ ట్రయిలర్ ఏ టైమ్ కు రిలీజ్ అవుతుంది? ఇప్పుడా మేటర్ ను మేకర్స్ రివీల్ చేశారు.

వకీల్ సాబ్ ట్రయిలర్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుంది. దిల్ రాజు యూట్యూబ్ ఛానెల్ పై ఈ ట్రయిలర్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ ట్రయిలర్ పై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ బట్టి చూస్తే.. వకీల్ సాబ్ ట్రయిలర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో అత్యథిక లైక్స్ దక్కించుకున్న రికార్డు, అతి తక్కువ టైమ్ లో అత్యథిక వ్యూస్ సాధించిన రికార్డును వకీల్ సాబ్ బద్దలుకొట్టేలా ఉంది.

Tags:    
Advertisement

Similar News