అవార్డులు.. రాజకీయాలు.. సెటైర్లు..

సినిమాలు, రాజకీయాలు.. వీటిని వేరు చేసి చూడలేం. అందులోనూ ఇప్పుడు ఈ రెండు రంగాలు బాగా పెనవేసుకుపోయాయి. సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం, పోటీ చేయడం, వీలైతే పార్టీల తరపున ప్రచారంలో పాల్గొనడం, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులో, రాజ్యసభ సీట్లో బహుమతిగా పొందడం చూస్తూనే ఉన్నాం. రాజ్యసభ సీటు మరీ పెద్ద ప్రత్యుపకారం అనుకుంటే.. పద్మ అవార్డులు ఉండనే ఉన్నాయి. అవీ కుదరదు అనుకుంటే.. జాతీయ ఉత్తమ నటులుగా అస్మదీయులకు వీరతాళ్లు వేసే అవకాశం ఎలాగూ ఉంది. […]

Advertisement
Update:2021-03-23 02:36 IST

సినిమాలు, రాజకీయాలు.. వీటిని వేరు చేసి చూడలేం. అందులోనూ ఇప్పుడు ఈ రెండు రంగాలు బాగా పెనవేసుకుపోయాయి. సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం, పోటీ చేయడం, వీలైతే పార్టీల తరపున ప్రచారంలో పాల్గొనడం, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులో, రాజ్యసభ సీట్లో బహుమతిగా పొందడం చూస్తూనే ఉన్నాం. రాజ్యసభ సీటు మరీ పెద్ద ప్రత్యుపకారం అనుకుంటే.. పద్మ అవార్డులు ఉండనే ఉన్నాయి. అవీ కుదరదు అనుకుంటే.. జాతీయ ఉత్తమ నటులుగా అస్మదీయులకు వీరతాళ్లు వేసే అవకాశం ఎలాగూ ఉంది. ఈ ఏడాది ప్రకటించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా కూడా అలాంటి విమర్శలనే ఎదుర్కుంటోంది. ఇటు అవార్డులు ప్రకటించడం, అటు సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తడం ఒకేసారి జరిగింది.

రజినీకాంత్ చేసిన మేలుకి బదులు చెల్లించారా..?
తమిళనాట రజినీకాంత్ పార్టీ పెట్టకుండా వేసిన వెనకడుగుకి అసలు కారణం బీజేపీయేనని అంటారు. రజినీకాంత్ బీజేపీలో చేరాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది, ఒకవేళ సొంతగా పార్టీ పెడితే కచ్చితంగా కమలదళంతో చేతులు కలుపుతారనే మాట కూడా వినిపించింది. అయితే రజినీ ఇంకాస్త తెలివిగా వ్యవహరించారు. బరిలో దిగకముందే అస్త్ర సన్యాసం చేసి పరోక్షంగా బీజేపీకి మేలు చేశారు. దానికి ప్రత్యుపకారంగానే రజినీ అల్లుడు ధనుష్ కి జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డు ఇచ్చారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అసురన్ సినిమాలో ధనుష్ నటనకి వంక పెట్టలేం. అయితే అదే ఏడాది విడుదలైన చాలా సినిమాల్లో ధనుష్ ని మించిన పర్ఫామెన్స్ ఇచ్చిన నటులూ ఉన్నారు. భోంస్లే చిత్రానికిగాను మనోజ్ బాజ్ పాయ్ కూడా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అసలు మనోజ్ కి సోలోగా ఈ అవార్డు ఇస్తే బాగుండేది అనేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా ధనుష్ అవార్డుని, రజినీ బీజేపీకి చేసిన ఉపకారంతో ముడిపెడుతూ వార్తలొస్తున్నాయి.

కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?
కంగనా రనౌత్ కోసం మహారాష్ట్ర సర్కారుతోనే పోరాటానికి దిగింది బీజేపీ. ఇక కంగనా బీజేపీపై ఎక్కడలేని ఆప్యాయత చూపించేది. సామాజిక సమస్యలపై అంతెత్తున ఎగిరిపడే కంగన.. రైతు ఉద్యమాన్ని తక్కువచేసి మాట్లాడటం కూడా బీజేపీ వ్యూహంలో భాగమే. ఇటీవల చిరిగిన జీన్స్ వ్యవహారంలో.. మహిళాలోకం అంతా ఉత్తరాఖండ్ సీఎం రావత్ పై విమర్శలతో విరుచుకుపడుతుంటే.. కంగన మాత్రం ఆయనకు సపోర్ట్ చేశారు. కారణం, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి కావడమే. కంగనా రనౌత్, కమలదళం మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ దాదాపుగా దేశ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈ దఫా కంగనాకు అవార్డు రావడాన్ని ఎవరూ పెద్ద విశేషం అనుకోలేదు.

మొత్తమ్మీద జాతీయ అవార్డుల జాబితా కంటే.. సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు, సెటైర్లు, మీమ్స్.. ఈసారి బాగా వైరల్ అవుతున్నాయి. వచ్చే దఫా వకీల్ సాబ్ కి కచ్చితంగా అవార్డుల్లో చోటివ్వండి అంటూ ఆల్రడీ కొంతమంది రచ్చ మొదలు పెట్టారు కూడా. అప్పటి వరకు బీజేపీతో జనసేన కలసి ఉండగలిగితే.. పవన్ జాతీయ ఉత్తమ నటుడు కావడం గ్యారెంటీ అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News