వాయిదాపడిన రానా సినిమా

రానా నటించిన అరణ్య సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. కానీ ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అవ్వడం లేదు. అవును.. అరణ్య సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కింది అరణ్య. తమిళ్ లో ఈ సినిమాకు కాదన్ అనే టైటిల్ పెట్టారు. హిందీలో హాథీ మేరీ సాథీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. […]

Advertisement
Update:2021-03-23 14:32 IST

రానా నటించిన అరణ్య సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. కానీ ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అవ్వడం లేదు. అవును.. అరణ్య సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రకటించింది.

తెలుగు-తమిళ-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కింది అరణ్య. తమిళ్ లో ఈ సినిమాకు కాదన్ అనే టైటిల్ పెట్టారు. హిందీలో హాథీ మేరీ సాథీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడీ హాథీ మేరీ సాథీ వెర్షన్ ను రిలీజ్ చేయడం లేదు.

బాలీవుడ్ మూవీ మార్కెట్ లో కరోనా పరిస్థితులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు నార్త్ లోని మరో 3 రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలయ్యాయి. ఈ నేపథ్యంలో హాథీ మేరీ సాధీ సినిమాను విడుదల చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని యూనిట్ భావించింది. అందుకే హిందీ వెర్షన్ ను పోస్ట్ పోన్ చేసి.. తెలుగు-తమిళ వెర్షన్లను ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News