డైలాగ్స్ చెబుతున్న వకీల్ సాబ్

వకీల్ సాబ్ సినిమా మరో కీలకమైన దశకు చేరుకుంది. ఈ మూవీకి సంబంధించి పవన్ కల్యాణ్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. సినిమాకు సంబంధించి అందరి డబ్బింగ్స్ పూర్తయ్యాయి. పవన్ కల్యాణ్ వాయిస్ ఒక్కటే బ్యాలెన్స్. ఆ పార్ట్ ఇప్పుడు మొదలైంది. పవన్ కల్యాణ్ డబ్బింగ్ అనే అంశాన్ని కూడా యూనిట్ ప్రచారానికి వాడుకుంది. పవన్ కల్యాణ్ స్టుడియోలో అడుగుపెట్టినప్పట్నుంచి.. తిరిగి వెళ్లేవరకు ఫొటోలు తీసి మీడియాకు రిలీజ్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. […]

Advertisement
Update:2021-03-23 14:34 IST

వకీల్ సాబ్ సినిమా మరో కీలకమైన దశకు చేరుకుంది. ఈ మూవీకి సంబంధించి పవన్ కల్యాణ్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. సినిమాకు సంబంధించి అందరి డబ్బింగ్స్ పూర్తయ్యాయి. పవన్ కల్యాణ్ వాయిస్ ఒక్కటే బ్యాలెన్స్. ఆ పార్ట్ ఇప్పుడు మొదలైంది.

పవన్ కల్యాణ్ డబ్బింగ్ అనే అంశాన్ని కూడా యూనిట్ ప్రచారానికి వాడుకుంది. పవన్ కల్యాణ్ స్టుడియోలో అడుగుపెట్టినప్పట్నుంచి.. తిరిగి వెళ్లేవరకు ఫొటోలు తీసి మీడియాకు రిలీజ్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

వచ్చేనెల 9న థియేటర్లలోకి రాబోతోంది వకీల్ సాబ్. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనన్య, అంజలి, నివేత థామస్ కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ఈ ముగ్గురు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. శృతిహాసన్ ది దాదాపు గెస్ట్ రోల్. ఆమె ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది.

Tags:    
Advertisement

Similar News