ఎవరీ తీన్మార్​ మల్లన్న..!

నల్లగొండ, వరంగల్​, ఖమ్మం, కరీంనగర్​ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికతో తీన్మార్​ మల్లన్న ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. గణనీయమైన ఓట్లు సాధిస్తూ.. రౌండ్​ రౌండ్​లోనూ టీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డికి చమటలు పట్టించారు. విపరీతమైన ఓటు షేర్​ సాధించారు. ఓ స్వతంత్ర అభ్యర్థికి ఈ స్థాయిలో క్రేజ్​ దక్కడానికి కారణం ఏమిటి? అసలు తీన్మార్​ మల్లన్న వెనుక ఎవరైనా ఉన్నారా? అతడి రాజకీయ నేపథ్యం ఏమిటి? తీన్మార్​ మల్లన్న అలియాస్​ చింతపండు నవీన్​కుమార్ పుట్టిన ఊరు. యాదాద్రి […]

Advertisement
Update:2021-03-21 17:50 IST

నల్లగొండ, వరంగల్​, ఖమ్మం, కరీంనగర్​ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికతో తీన్మార్​ మల్లన్న ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. గణనీయమైన ఓట్లు సాధిస్తూ.. రౌండ్​ రౌండ్​లోనూ టీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డికి చమటలు పట్టించారు. విపరీతమైన ఓటు షేర్​ సాధించారు. ఓ స్వతంత్ర అభ్యర్థికి ఈ స్థాయిలో క్రేజ్​ దక్కడానికి కారణం ఏమిటి? అసలు తీన్మార్​ మల్లన్న వెనుక ఎవరైనా ఉన్నారా? అతడి రాజకీయ నేపథ్యం ఏమిటి?

తీన్మార్​ మల్లన్న అలియాస్​ చింతపండు నవీన్​కుమార్ పుట్టిన ఊరు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్​ గ్రామం. అతడిదో నిరుపేద కుటుంబం. మల్లన్న తల్లిదండ్రులు వ్యవసాయం, వ్యవసాయ కూలి పనులు చేస్తుంటారు. ఉస్మానియాలో చదువుకున్న తీన్మార్​ మల్లన్న.. ఓ టీవీ చానల్​లో నిర్వహించిన ‘తీన్మార్’ అనే టీవీ షో ద్వారా పాపులర్​ అయ్యారు. ఇప్పుడు కూడా ఓ టీవీ చానల్​లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కేవలం సోషల్​మీడియానే నమ్మకున్నారు.

మల్లన్న ‘క్యూన్యూస్​’ అనే ఓ చానల్​ను ప్రారంభించి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజలకు చేరువయ్యారు. అంతేకాక మల్లన్న తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన న్యూస్​ చదివే విధానం కూడా తెలంగాణ స్లాంగ్​లో ఉంటుంది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్​ వచ్చింది. అనతికాలంలోనే సదరు చానల్​ క్రేజ్​ తెచ్చుకున్నది. దీనికి తోడు ప్రభుత్వ పెద్దల మీద నేరుగా విమర్శలు చేయడంతో యువతలో ఫాలోయింగ్​ వచ్చింది. వెరసి తీన్మార్​ మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గణనీయమైన ఓట్లు వచ్చాయి.

గతంలోనూ మల్లన్న పలుసార్లు ఎన్నికల్లో పోటీచేశారు. 2019లో హుజూరునగర్​ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తీన్మార్​ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయగా కనీసం డిపాజిట్​ కూడా దక్కలేదు. అంతకుముందు నల్లగొండ స్థానానికే కాంగ్రెస్​ తరఫున పోటీచేయగా 10వేల ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం పకడ్బందీగా ఓ టీంను సిద్ధం చేసుకొని.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే నల్లగొండ లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.

ఏది ఏమైనా ఓ స్వతంత్ర అభ్యర్థి ప్రధానపార్టీలకు దీటుగా .. అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీఇవ్వడం అభినందనీయమే. ​

Tags:    
Advertisement

Similar News