ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ డీటెయిల్స్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. అల వైకుంఠపురములో సినిమా సెట్స్ పై ఉంటుండగానే ఈ ప్రాజెక్టు లాక్ అయింది. కాకపోతే ఆర్ఆర్ఆర్ వల్ల, మధ్యలో వచ్చిన కరోనా వల్ల ప్రాజెక్టు దాదాపు ఏడాది ఆలస్యమైంది. అలా లేట్ అయిన ఈ సినిమా ఇప్పుడు పట్టాలపైకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమాను లాంఛ్ చేయబోతున్నారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం అప్పుడే సెట్స్ పైకి రాడు. మే నెలాఖరు నుంచి తారక్ సెట్స్ […]

Advertisement
Update:2021-03-17 04:05 IST

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. అల వైకుంఠపురములో సినిమా సెట్స్ పై ఉంటుండగానే ఈ ప్రాజెక్టు లాక్ అయింది. కాకపోతే ఆర్ఆర్ఆర్ వల్ల, మధ్యలో వచ్చిన కరోనా వల్ల ప్రాజెక్టు దాదాపు ఏడాది ఆలస్యమైంది. అలా లేట్ అయిన ఈ సినిమా ఇప్పుడు పట్టాలపైకి రాబోతోంది.

ఉగాది సందర్భంగా ఈ సినిమాను లాంఛ్ చేయబోతున్నారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం అప్పుడే సెట్స్ పైకి రాడు. మే నెలాఖరు నుంచి తారక్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లోగా మిగతా సీన్స్ పూర్తిచేస్తాడు త్రివిక్రమ్.

ఈ సినిమాతో మరోసారి పూజా హెగ్డేను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఇంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో, అరవింద సమేత సినిమాలు చేసింది పూజాహెగ్డే. హారిక-హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.

Tags:    
Advertisement

Similar News