శ్రీకారం మొదటి వారాంతం వసూళ్లు
శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ఊహించని విధంగా పడిపోయింది. వీకెండ్ లో కూడా ఈ సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు. ఇంకా చెప్పాలంటే, రిలీజ్ రోజు వచ్చిన కలెక్షన్లే ఈ సినిమాకు ఫైనల్. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (4 రోజుల రన్) పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అయితే ఈ వసూళ్లు ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే, శ్రీకారం బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే ఇంకా 5 కోట్ల రూపాయలు కావాలి. ప్రస్తుతం […]
శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ఊహించని విధంగా పడిపోయింది. వీకెండ్ లో కూడా ఈ సినిమాకు
పెద్దగా వసూళ్లు రాలేదు. ఇంకా చెప్పాలంటే, రిలీజ్ రోజు వచ్చిన కలెక్షన్లే ఈ సినిమాకు ఫైనల్. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (4 రోజుల రన్) పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
అయితే ఈ వసూళ్లు ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే, శ్రీకారం బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే ఇంకా 5 కోట్ల
రూపాయలు కావాలి. ప్రస్తుతం నడుస్తున్న టాక్ తో ఈ సినిమాకు మరో 5 కోట్లు వసూళ్లు అంటే దాదాపు
అసాధ్యమనే చెప్పాలి. అలా శర్వానంద్ కెరీర్ లో మరో ఫ్లాప్ మూవీగా ముద్రవేసుకోబోతోంది శ్రీకారం.
ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 1.98 కోట్లు
సీడెడ్ – రూ. 1.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.05 కోట్లు
ఈస్ట్ – రూ. 0.73 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.92 కోట్లు
నెల్లూరు – రూ. 0.35 కోట్లు
కృష్ణా – రూ. 0.46 కోట్లు