జాతిరత్నాలు 4 రోజుల వసూళ్లు
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఈ 4 రోజుల రన్ లో సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. క్లీన్ కామెడీ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. అలా మొదటి వారాంతంలో ఈ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో (రెమ్యూనరేషన్స్ కాకుండా) తెరకెక్కింది జాతిరత్నాలు సినిమా. 4 రోజుల్లోనే ఈ సినిమాకు 20 […]
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఈ 4 రోజుల రన్ లో సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. క్లీన్ కామెడీ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. అలా మొదటి వారాంతంలో ఈ సినిమా 20 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో (రెమ్యూనరేషన్స్ కాకుండా) తెరకెక్కింది జాతిరత్నాలు సినిమా. 4 రోజుల్లోనే ఈ సినిమాకు 20 కోట్లు వచ్చాయంటే లాభాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫైనల్ రన్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 40 కోట్ల క్లబ్ లో చేరుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేకప్ ఇలా ఉంది.
నైజాం – రూ. 7.7 కోట్లు
సీడెడ్ – రూ. 2.2 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.25 కోట్లు
ఈస్ట్ – రూ. 1.1 కోట్లు
వెస్ట్ – రూ. 0.98 కోట్లు
గుంటూరు – రూ. 1.3 కోట్లు
కృష్ణా – రూ. 1.05 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు