కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి కొండా
కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లో చేరారు. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. చాలా రోజుల క్రితమే కొండా పార్టీని వీడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీని వీడితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం […]
కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లో చేరారు. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. చాలా రోజుల క్రితమే కొండా పార్టీని వీడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీని వీడితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం కలుగుతుందని ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం.
ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తొలిసారి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. అప్పట్లో టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌తో విబేధాలు రావడం వల్లే కొండా పార్టీని వీడినట్టు వార్తలు వచ్చాయి.
అయితే 2019లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీచేశారు. అయితే సల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి చాలా ఆయన కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.అయితే ఆయన తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి..!
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ నేతలు, క్యాడర్ చతికిల పడ్డారు. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదించలేదు. కొత్త అధ్యక్షుడిని కూడా నియమించలేదు. దీంతో క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో ఇంతవరకు స్పందించడం లేదు.