వంట చేస్తూ మందు కొట్టిన హీరోయిన్

టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఆమని. హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు. ఇలాంటి నటి, ఓ బోల్డ్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది. మరీ ముఖ్యంగా మందు కొట్టే సీన్లు చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఓ విలక్షణమైన బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది ఆమని. ఆ సినిమా పేరు చావుకబురు చల్లగా. 90ల్లో మావిచిగురు, శుభలగ్నం లాంటి హోమ్లీ కారెక్టర్స్‌తో అలరించిన ఆమని.. చావు కబురు చల్లగా సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల […]

Advertisement
Update:2021-03-14 06:40 IST

టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఆమని. హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు. ఇలాంటి నటి, ఓ
బోల్డ్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది. మరీ ముఖ్యంగా మందు కొట్టే సీన్లు చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి
ఓ విలక్షణమైన బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది ఆమని. ఆ సినిమా పేరు చావుకబురు చల్లగా.

90ల్లో మావిచిగురు, శుభలగ్నం లాంటి హోమ్లీ కారెక్టర్స్‌తో అలరించిన ఆమని.. చావు కబురు చల్లగా
సినిమాలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చేతిలో మద్యం సీసా..
వంట చేస్తూ విడుదలైన ఈమె ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తుంది.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో కౌశిక్ దర్శకుడిగా
పరిచయమౌతున్నాడు. ఈనెల 19న థియేటర్లలోకి వస్తోంది చావు కబురు చల్లగా.

Tags:    
Advertisement

Similar News