జాతిరత్నాలు తొలి రోజు కలెక్షన్
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన జాతిరత్నాలు సినిమా శివరాత్రి సక్సెస్ గా నిలిచింది. గాలిసంపత్, శ్రీకారం కంటే ఈ సినిమాకే ఎక్కువమంది ఓటేశారు. అలా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమాకు తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం పెద్ద విషయం. మరీ ముఖ్యంగా […]
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన జాతిరత్నాలు సినిమా శివరాత్రి
సక్సెస్ గా నిలిచింది. గాలిసంపత్, శ్రీకారం కంటే ఈ సినిమాకే ఎక్కువమంది ఓటేశారు. అలా పాజిటివ్ టాక్
తో ప్రారంభమైన ఈ సినిమాకు తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్
లో వసూళ్లు రావడం పెద్ద విషయం. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు
వచ్చాయి. ఈ వీకెండ్ గడిచేసరికి కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా
వేస్తోంది.
ఏపీ,నైజాంలో జాతిరత్నాలకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 1.45 కోట్లు
సీడెడ్ – రూ. 0.55 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.48 కోట్లు
గుంటూరు – రూ. 0.39 కోట్లు
ఈస్ట్ – రూ. 0.31 కోట్లు
వెస్ట్ – రూ. 0.28 కోట్లు
కృష్ణా – రూ. 0.25 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు