రకుల్ కు మరో బంపరాఫర్?

రకుల్ కు తెలుగులో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. స్టార్ హీరోలు ఆమెను దాదాపు పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆమె వదులుకునే పరిస్థితిలో లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ బంపర్ ఆఫర్ అందుకుంది ఈ అమ్మాయి. దిల్ రాజు బ్యానర్ పై శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకోవాలనే […]

Advertisement
Update:2021-03-09 02:56 IST

రకుల్ కు తెలుగులో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోతున్నాయి. స్టార్ హీరోలు ఆమెను దాదాపు పక్కన
పెట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని
ఆమె వదులుకునే పరిస్థితిలో లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ బంపర్ ఆఫర్ అందుకుంది ఈ
అమ్మాయి.

దిల్ రాజు బ్యానర్ పై శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ
సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. నిజంగా ఇది రకుల్ కు బంపర్
ఆఫర్ అయితే, మెగా ఫ్యాన్స్ కు మాత్రం షాకింగ్ న్యూస్.

చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే
బాగుంటుంది. అలియాభట్, కియరా అద్వానీ, అనన్య పాండే.. ఇలా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వీళ్లను కాదని రకుల్ పేరు వినిపించడం ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురిచేసింది.

ఈ సంగతి పక్కనపెడితే.. నిజంగా ఈ సినిమాలో ఛాన్స్ అందుకుంటే మాత్రం రకుల్ కెరీర్ మరోసారి
ఊపందుకున్నట్టే. చరణ్-రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. కేవలం ఆ అనుబంధంతోనే
రకుల్ తో 2 సినిమాలు చేశాడు చెర్రీ. ఇప్పుడు ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట.

Tags:    
Advertisement

Similar News