ఆచార్య యూనిట్ పై చిరంజీవి కోపం
ఊహించని విధంగా ఆచార్య యూనిట్ నుంచి ఓ కీలకమైన స్టిల్ ఒకటి బయటకొచ్చింది. అందులో చరణ్, చిరంజీవి నక్సలైట్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఈ ఒక్క స్టిల్ తో సినిమాలో వీళ్ల పాత్రలు ఏంటనే విషయం బయటకొచ్చేసింది. ఇన్నాళ్లూ సినిమాలో చరణ్ మాత్రమే నక్సలైట్ అని అంతా అనుకున్నారు. చిరంజీవి కూడా అదే దుస్తుల్లో కనిపించడంతో కథలో కీలకమైన విషయాన్ని బయటపెట్టినట్టయింది. ఇలా ఊహించని విధంగా తన సినిమా నుంచి అత్యంత కీలకమైన ఫొటో బయటకు రావడంతో చిరంజీవి […]
ఊహించని విధంగా ఆచార్య యూనిట్ నుంచి ఓ కీలకమైన స్టిల్ ఒకటి బయటకొచ్చింది. అందులో చరణ్,
చిరంజీవి నక్సలైట్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఈ ఒక్క స్టిల్ తో సినిమాలో వీళ్ల పాత్రలు ఏంటనే విషయం
బయటకొచ్చేసింది. ఇన్నాళ్లూ సినిమాలో చరణ్ మాత్రమే నక్సలైట్ అని అంతా అనుకున్నారు. చిరంజీవి
కూడా అదే దుస్తుల్లో కనిపించడంతో కథలో కీలకమైన విషయాన్ని బయటపెట్టినట్టయింది.
ఇలా ఊహించని విధంగా తన సినిమా నుంచి అత్యంత కీలకమైన ఫొటో బయటకు రావడంతో చిరంజీవి
యూనిట్ పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఇకపై ఎలాంటి లీకులు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
చేయాలని యూనిట్ ను ఆదేశించాడు.
అయితే యూనిట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటి లీకుల్ని ఆపడం ఎవ్వరితరం కాదు. ఎందుకంటే,
ఔట్ డోర్ లో షూట్ చేస్తున్నప్పుడు.. ఎవరు ఎట్నుంచి తమ మొబైల్ ఫోన్లకు పనిచెబుతారో ఎవ్వరూ
ఊహించలేదు. కాస్త దూరం నుంచి కూడా క్లిక్ మనిపించే పవర్ ఫుల్ కెమెరాలతో ఫోన్లు అందుబాటులోకి
వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి యూనిట్ పై కోపం ప్రదర్శించేకంటే సంయమనంతో ఉంటే
మంచిదేమో.