చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న బాలకృష్ణ..

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా తన పని తాను చేసుకుంటూ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్న బాలయ్యను పట్టుబట్టి మరీ మున్సిపల్ ప్రచారానికి తీసుకొచ్చారు చంద్రబాబు. అయితే రెండు రోజుల ప్రచారంలోనే బాలయ్య అభ్యర్థులకు చుక్కలు చూపించారు. ప్రచార పర్వంలో ఆయన అసహనం, ఆగ్రహం.. ఓటర్లను ఇబ్బంది పెట్టడమే కాదు, అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన నోటి మాటతోపాటు.. చేతి దెబ్బ కూడా ఒకరికి రుచి చూపించారు బాలకృష్ణ. తన అనుమతి […]

Advertisement
Update:2021-03-06 14:43 IST

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా తన పని తాను చేసుకుంటూ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్న బాలయ్యను పట్టుబట్టి మరీ మున్సిపల్ ప్రచారానికి తీసుకొచ్చారు చంద్రబాబు. అయితే రెండు రోజుల ప్రచారంలోనే బాలయ్య అభ్యర్థులకు చుక్కలు చూపించారు. ప్రచార పర్వంలో ఆయన అసహనం, ఆగ్రహం.. ఓటర్లను ఇబ్బంది పెట్టడమే కాదు, అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన నోటి మాటతోపాటు.. చేతి దెబ్బ కూడా ఒకరికి రుచి చూపించారు బాలకృష్ణ. తన అనుమతి లేకుండా వీడియో ఎందుకు తీస్తున్నావంటూ, ఓ ఫోటో గ్రాఫర్‌ పై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని 9 వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లిన బాలయ్య, అక్కడి వారితో మాట్లాడుతుండగా.. ​ ఒక ఫోటో గ్రాఫర్ వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. ఇది చూసి తీవ్ర ఆవేశంతో వెంటనే అతనిమీదకు వెళ్లిపోయారు బాలయ్య. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అంటూ చెంప చెళ్లుమనిపించారు. పర్సనల్‌గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా, వెంటనే డిలీట్‌ చేయ్‌ అని మండిపడ్డారు. బాలయ్య కోపం అందరికీ తెలిసిందే అయినా.. ఇలా చేయి చేసుకోవడం, అందులోనూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంకోసం వచ్చి రెచ్చిపోవడం చూసి అభ్యర్థులు భయపడి పోతున్నారు. బాలయ్య ఓవర్ యాక్షన్ ప్రభావం తమకు వచ్చే ఓట్లపై పడుతుందేమోనని టెన్షన్ పడిపోతున్నారు.

ఫొటోగ్రాఫర్ వివరణతో సర్దుబాటు..
బాలయ్య వ్యవహారంతో ఇరుకున పడే ప్రమాదం ఉండటంతో వెంటనే పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. బాలయ్య చేతిలో దెబ్బతిన్న ఫొటోగ్రాఫర్ తో వివరణ ఇప్పించారు నేతలు. అయితే ఎవరో రాసిన దాన్ని చదువుతున్నట్టు, జరిగిన దాంట్లో బాలయ్య తప్పేమీ లేదని, ఆయన చేయి తన చెంపని తాకడమే తన అదృష్టం అని సదరు ఫొటోగ్రాఫర్ చెప్పడమే విచిత్రం. గతంలో కూడా బాలయ్య అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. వాటిని కవర్ చేసుకోడానికి నానా తంటాలు పడ్డారు కూడా. తాజాగా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బాలయ్య దూకుడు మరీ ఇబ్బందికరంగా మారిందని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తమ్మీద బాలకృష్ణ రావడంతో టీడీపీకి కలిసొచ్చేదేమీ లేకపోగా, తన్నుల వ్యవహారంతో వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయని తేలిపోయింది.

Tags:    
Advertisement

Similar News