నినాదాలు కాదు.. నిధులు కావాలి: కేటీఆర్​

‘తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నది. కనీసం విభజన హామీలను కూడా నెరవేర్చలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంపై శీతకన్ను వేసింది,’ అంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రప్రభుత్వంపై ఫైర్​ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ సాయం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సమాజం కేంద్రంపై తన వాదనను వినిపించాల్సి వచ్చిందని అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని […]

Advertisement
Update:2021-03-06 12:28 IST

‘తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నది. కనీసం విభజన హామీలను కూడా నెరవేర్చలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంపై శీతకన్ను వేసింది,’ అంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ కేంద్రప్రభుత్వంపై ఫైర్​ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏ సాయం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సమాజం కేంద్రంపై తన వాదనను వినిపించాల్సి వచ్చిందని అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలకు కేంద్రం తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు.

‘ఆత్మనిర్భర్​ భారత్​’ అంటూ నినాదాలు ఇస్తే సరిపోదని అందుకు తగినట్టుగా నిధులు కూడా కేటాయించాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధితో దూసుకెళ్తుంటే కేంద్రం ఏ రకంగానూ సాయం చేయడం లేదని మండిపడ్డారు. గత ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు జరిగాయి. వీటిని ప్రపంచమే ప్రశంసించింది. కేంద్రం కూడా పలుమార్లు తెలంగాణ విధానాలు బాగున్నాయని కొనియాడింది. కానీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఇవ్వడం లేదు అంటూ మండిపడ్డారు.

ఐటీఐఆర్​ను రద్దు చేశారని.. వరంగల్​లో రైల్వే కోచ్​ల కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేం ఎవరిని అడగాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక రెవెన్యూ తీసుకుంటున్నారని కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు.

అయితే ఇటీవల కేటీఆర్​ వరసగా పలు సమావేశాల్లో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కేటీఆర్​ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నట్టు సమాచారం. దుబ్బాక, జీహెచ్​ఎంసీలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా ఆ పార్టీని దెబ్బతీయాలని టీఆర్​ఎస్​ భావిస్తున్నది. ఇందులో భాగంగానే బీజేపీపై కేటీఆర్​ నేరుగా విమర్శలు చేస్తున్నారని సమాచారం.

Tags:    
Advertisement

Similar News