రిపబ్లిక్ డే నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హుల గుర్తింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు శుక్రవారంతో ముగిశాయి. నాలుగు రోజుల్లో మొత్తం 12,861 గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లోని 3,487 డివిజన్లు, వార్డుల్లోనూ సభలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే ఈ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారి వివరాలు వెల్లడించడంతో పాటు ఆయా పథకాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తన దరఖాస్తులు స్వీకరించామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ సభల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించింది.
Advertisement