ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన మారుతి
ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా పై అంతటా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే, ఆ ఉత్కంఠకి తెరదించుతూ ఇటీవలే గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను ఎనౌన్స్ చేశారు దర్శకుడు మారుతి. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్ లో మొదలైంది. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – […]
ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత విలక్షణ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా పై
అంతటా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే, ఆ ఉత్కంఠకి తెరదించుతూ ఇటీవలే గోపీచంద్ తో పక్కా
కమర్షియల్ సినిమాను ఎనౌన్స్ చేశారు దర్శకుడు మారుతి. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్
హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్ లో మొదలైంది.
ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – మారుతి
కాంబినేషన్ సెట్ అయింది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్,
ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూ వి క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా,
ప్రతిరోజు పండుగ తో హాట్రిక్ రాగా ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ గోపిచంద్ 29వ సినిమాగా,
మారుతి 10వ సినిమాగా పక్కా కమర్షీయల్ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.