పవన్, అనసూయ.. ఓ ఐటెంసాంగ్

చావుకబురు చల్లగా అనే సినిమాలో అనసూయ ఐటెంసాంగ్ చేసింది. అయితే దాన్ని ఐటెం సాంగ్ అంటే అనసూయ ఒప్పుకోదు. ఈ సంగతి పక్కనపెడితే, పవన్ కల్యాణ్ సినిమాలో కూడా ఆమె ఐటెంసాంగ్ చేసింది. దాని షూటింగ్ కూడా పూర్తయింది. పవన్-క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ ఐటెంసాంగ్ చేసింది. ఈ పాటలో అనసూయతో పాటు మరో బ్యూటీ పూజిత పొన్నాడ కూడా చిందేసింది. అయితే పవన్ సినిమాలో తను […]

Advertisement
Update:2021-02-26 13:31 IST

చావుకబురు చల్లగా అనే సినిమాలో అనసూయ ఐటెంసాంగ్ చేసింది. అయితే దాన్ని ఐటెం సాంగ్ అంటే
అనసూయ ఒప్పుకోదు. ఈ సంగతి పక్కనపెడితే, పవన్ కల్యాణ్ సినిమాలో కూడా ఆమె ఐటెంసాంగ్
చేసింది. దాని షూటింగ్ కూడా పూర్తయింది.

పవన్-క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ
ఐటెంసాంగ్ చేసింది. ఈ పాటలో అనసూయతో పాటు మరో బ్యూటీ పూజిత పొన్నాడ కూడా చిందేసింది.
అయితే పవన్ సినిమాలో తను ఐటెంసాంగ్ చేసిన విషయాన్ని అనసూయ కన్ ఫర్మ్ చేయలేదు. తను ఆ
సినిమా ఉన్నానని మాత్రమే చెబుతోంది.

ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే టైటిల్ అనుకుంటున్నారు. శివరాత్రికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పవన్ లుక్ ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్
అవ్వడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags:    
Advertisement

Similar News