సీటీమార్ టీజర్ రివ్యూ
గోపిచంద్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీటీమార్ మూవీ టీజర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. యాక్షన్ చెప్పగానే కబడ్డీ, కబడ్డీ,కబడ్డీ అంటూ మొదలైన 70 సెకెన్ల నిడివిగల ఈ టీజర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రేయ్ కార్తి..అంటూ రావు రమేష్ పిలవగానే `నన్నెవడైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి..ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది` అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్ టీజర్ కే […]
గోపిచంద్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీటీమార్ మూవీ టీజర్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు.
యాక్షన్ చెప్పగానే కబడ్డీ, కబడ్డీ,కబడ్డీ అంటూ మొదలైన 70 సెకెన్ల నిడివిగల ఈ టీజర్ ఆధ్యంతం
ఉత్కంఠభరితంగా సాగింది.
రేయ్ కార్తి..అంటూ రావు రమేష్ పిలవగానే 'నన్నెవడైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు
పిలవాలి లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి..ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది' అంటూ
గోపిచంద్ చెప్పే డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. అలాగే 'కబడ్డీ మైదానంలో ఆడితే ఆట..బయట
ఆడితే వేట' అనే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ సీటీ వేయడంతో ఈ టీజర్ ముగుస్తుంది.
టీజర్ లో సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్ గా
నిలిచింది. భూమిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో తమన్న హీరోయిన్. ఏప్రిల్ 2న థియేటర్లలోకి
రానుంది సీటీమార్.