లింగుసామితో రామ్ సినిమా

రెడ్ సినిమా తర్వాత చాన్నాళ్ల పాటు తన కొత్త సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేసిన రామ్, ఎట్టకేలకు మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. తమిళ డైరక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా ఈరోజు ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది. రామ్ కెరీర్ లో ఇది తొలి తమిళ స్ట్రయిట్ మూవీ. కెరీర్ లో ఇప్పటివరకు రామ్ నేరుగా తమిళ […]

Advertisement
Update:2021-02-18 13:30 IST

రెడ్ సినిమా తర్వాత చాన్నాళ్ల పాటు తన కొత్త సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేసిన రామ్, ఎట్టకేలకు
మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. తమిళ డైరక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు
ప్రకటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా ఈరోజు
ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది.

రామ్ కెరీర్ లో ఇది తొలి తమిళ స్ట్రయిట్ మూవీ. కెరీర్ లో ఇప్పటివరకు రామ్ నేరుగా తమిళ సినిమా
చేయలేదు. లింగుసామి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఈ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు.
మూవీకి సంబంధించి టెక్నీషియన్స్, హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు.

గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఇది అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా. దాదాపు 4 ఏళ్ల కిందట బన్నీ
హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. అప్పుడు ఆ సినిమా ఆగిపోయింది.
ఇప్పుడిలా రామ్ హీరోగా సెట్స్ పైకి రాబోతోంది.

Tags:    
Advertisement

Similar News