ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: ఆగినచోటనుంచా? కొత్తగానా?

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్​ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్​ వచ్చేసింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మున్సిపల్​ ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే కొత్తగా నోటిఫికేషన్​ విడుదల చేయాలన్న విపక్షాల ప్రతిపాదనను ఈసీ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఆగిన చోట నుంచే నిర్వహించాలా? లేక […]

Advertisement
Update:2021-02-17 16:39 IST

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్​ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్​ వచ్చేసింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మున్సిపల్​ ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే కొత్తగా నోటిఫికేషన్​ విడుదల చేయాలన్న విపక్షాల ప్రతిపాదనను ఈసీ పట్టించుకోలేదు.

ఇదిలా ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఆగిన చోట నుంచే నిర్వహించాలా? లేక కొత్తగా నోటిఫికేషన్​ ఇవ్వాలా? అన్న విషయంపై ఈసీ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కొత్తగా నోటిఫికేషన్​ వస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కరోనా కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేశారు. అయితే వాయిదా సమయమంలో.. ఈ ప్రక్రియను తర్వాత యథావిధిగా కొనసాగిస్తామని ఈసీ ప్రకటించింది. అయితే ఇప్పుడు మాత్రం విపక్షాలు కొత్త నోటిఫికేషన్​ విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి. దీంతో తన ముందున్న ప్రత్యామ్నాయాలపై ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తున్నది.

అయితే ఎన్నికల సంఘం కొత్తగా నోటిఫికేషన్​ విడుదల చేస్తుందా? లేక పాత ప్రక్రియను కొనసాగిస్తుందా? లేక ఎస్ఈసీ పదవీకాలం అయిపోయింది కాబట్టి.. ఎన్నికలు నిర్వహించకుండా వదిలేస్తారా? అన్న అంశాలపై చర్చ నడుస్తున్నది. పాత ప్రక్రియను కొనసాగిస్తే విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.

అయితే కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తే ఎస్‌ఈసీ గతంలో చేసిన ప్రకటనను చూపుతూ ప్రభుత్వం కోర్టుకెళ్లే ఛాన్స్ ఉంది‌. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. 2248 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ బలవంతపు ఏకగ్రీవాలని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News