ఎక్కడ ఆగిపోయాయో అక్కడినుంచే..! ఏపీలో మున్సిపల్​ ఎన్నికల షెడ్యూల్​ వచ్చేసింది..!

ఏపీలో ఎన్నికల పండగ కొనసాగుతున్నది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. మున్సిపల్ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్టు ఈసీ ప్రకటించింది. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే అప్పటికే నామినేషన్​ ప్రక్రియ పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు మాత్రం గడువు ఉంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్​ ప్రకారం.. మార్చి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే […]

Advertisement
Update:2021-02-15 10:46 IST

ఏపీలో ఎన్నికల పండగ కొనసాగుతున్నది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. మున్సిపల్ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్టు ఈసీ ప్రకటించింది. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే అప్పటికే నామినేషన్​ ప్రక్రియ పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు మాత్రం గడువు ఉంది.

తాజాగా విడుదల చేసిన షెడ్యూల్​ ప్రకారం.. మార్చి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం ఎవరెవరు ఎన్నికల బరిలో ఉన్నది ఎన్నికల సంఘం ప్రకటించనున్నది.

ఏపీ వ్యాప్తంగా 12 మున్సిపల్​ కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీల‌కు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10 న పోలింగ్​ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరగనున్నది.
మార్చి 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికలకోడ్​ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికలకు మళ్లీ తాజాగా నోటిఫికేషన్​ విడుదల చేయాలని గత కొంతకాలంగా టీడీపీ, బీజేపీ నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. అయినప్పటికీ ఈసీ వాళ్ల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. ఇప్పటికే రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Tags:    
Advertisement

Similar News