ఛార్జింగ్ ఎలా పెట్టాలో తెలుసా?

బ్యాటరీ అయిపోగానే ఛార్జింగ్ పెట్టడం, బ్యాటరీ 100 పర్సెంట్ అవ్వగానే తీసేయడం, పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి పడుకోవడం.. దాదాపుగా అందరూ ఇలాగే చేస్తుంటారు. అయితే అలా చేయకూడదంటున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్.. మొబైల్ ఛార్జింగ్ పెట్టేందుకూ కొన్ని లెక్కలున్నాయి. అవేంటంటే.. స్మార్ట్ ఫోన్ ను వందశాతం ఛార్జ్ చేస్తేనే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ బ్యాటరీ 80శాతం నుంచి వంద శాతం వరకూ ఎంత ఛార్జ్ చేసినా మంచిదే. ప్రస్తుతం మనం వాడే మొబైల్స్ […]

Advertisement
Update:2021-02-13 11:42 IST

బ్యాటరీ అయిపోగానే ఛార్జింగ్ పెట్టడం, బ్యాటరీ 100 పర్సెంట్ అవ్వగానే తీసేయడం, పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి పడుకోవడం.. దాదాపుగా అందరూ ఇలాగే చేస్తుంటారు. అయితే అలా చేయకూడదంటున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్.. మొబైల్ ఛార్జింగ్ పెట్టేందుకూ కొన్ని లెక్కలున్నాయి.

అవేంటంటే..
స్మార్ట్ ఫోన్ ను వందశాతం ఛార్జ్ చేస్తేనే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ బ్యాటరీ 80శాతం నుంచి వంద శాతం వరకూ ఎంత ఛార్జ్ చేసినా మంచిదే. ప్రస్తుతం మనం వాడే మొబైల్స్ అన్నీ లిథియం అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. ఇవన్నీ సుమారుగా 500 నుంచి 1000 ఛార్జ్ సైకిల్స్ తో తయారువుతున్నాయి. అందుకే ఛార్జ్ పెట్టిన ప్రతిసారి 80శాతం ఛార్జ్ చేస్తే సరిపోతుంది.

ఇకపోతే బ్యాటరీను పూర్తిగా అయిపోయిన తర్వాత ఛార్జ్ చేస్తుంటారు చాలామంది. దాని వల్ ఫోన్ బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు ఉండాలంటే.. బ్యాటరీ 25 శాతం ఉన్నప్పుడే ఛార్జ్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప 25 శాతం కంటే తక్కువ పడిపోయే వరకూ మొబైల్ వాడకూడదు.

రాత్రి పడుకోబోయేముందు ఫోన్ ఛార్జింగ్ పెడితే స్మార్ట్ ఫోన్ లోని పొటెన్షియల్ కాంపొనెంట్స్ డ్యామేజ్ అవుతాయని నిపుణులు చెప్తున్నారు. బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఛార్జర్ ను డిస్ కనెక్ట్ చేయాలి.
ఇకపోతే అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. ఛార్జ్ చేసేటప్పుడు మొబైల్ హీట్ ఎక్కకుండా జాగ్రత్త పడాలి. ఎండగా ఉన్న ప్రాంతాల్లో, కిటికీల దగ్గర ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు. అలాగే ఫోన్ ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో గేమ్స్ ఆడకూడదు. అలాగే కాల్ మాట్లాడుతూ కూడా ఛార్జింగ్ పెట్టకూడదు.

వీటితో పాటు చార్జ్ చేసేందుకు ఎప్పుడూ మొబైల్ కంపెనీ ఇచ్చిన ఛార్జర్ నే వాడాలి. ఆ ఛార్జర్ తోనే ఛార్జ్ చేస్తే ఫోన్ బ్యాటరీ సరిగ్గా పనిచేస్తుంది.

Tags:    
Advertisement

Similar News