హీరో సూర్యకు కరోనా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకున్నానని తెలిపాడు సూర్య. తనను రీసెంట్ గా కలిసిన మిత్రులంతా ఓసారి చెక్ చేసుకోవాలని కోరాడు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయిందనే భ్రమలో చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని, శానిటైజర్లు వాడడం మానేశారని సూర్య ఆందోళన వ్యక్తంచేశాడు. ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా మనల్ని వీడి వెళ్లలేదని, ప్రజలంతా […]

Advertisement
Update:2021-02-08 13:00 IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు. తనకు
కరోనా సోకిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకున్నానని తెలిపాడు సూర్య. తనను
రీసెంట్ గా కలిసిన మిత్రులంతా ఓసారి చెక్ చేసుకోవాలని కోరాడు.

కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయిందనే భ్రమలో చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని,
శానిటైజర్లు వాడడం మానేశారని సూర్య ఆందోళన వ్యక్తంచేశాడు. ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా మనల్ని
వీడి వెళ్లలేదని, ప్రజలంతా అప్రమత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.

సూర్యకు కరోనా అని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు కలవరపడ్డారు. త్వరగా కోలుకోవాలని,
సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు అంతటా సూర్య అభిమానులు ప్రత్యేక
పూజలు నిర్వహిస్తున్నారు.

రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేశాడు సూర్య. అది పెద్ద హిట్టయింది. ప్రస్తుతం తన
తదుపరి సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News