తెలివైన క్రిమినల్.. చెక్ ట్రయిలర్
హీరోయిజం ఉంటూనే డిఫరెంట్ గా ఉండే పాత్రలు ఎంచుకుంటున్నాడు నితిన్. కేవలం మాస్ మూస తరహా క్యారెక్టర్లు కాకుండా నటించడానికి స్కోప్ ఉండే క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చెక్ సినిమా అలాంటిదే. ఈ సినిమాలో ఉరిశిక్ష పడిన ఖైదీగా నితిన్ కనిపిస్తున్నాడు. సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ వచ్చేశాయి. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశాడు. ట్రయిలర్ ప్రకారం చూస్తే.. నితిన్ అపర మేధావిలా కనిపిస్తున్నాడు. తన తెలివితేటలతో చెస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు. అయితే […]
హీరోయిజం ఉంటూనే డిఫరెంట్ గా ఉండే పాత్రలు ఎంచుకుంటున్నాడు నితిన్. కేవలం మాస్ మూస తరహా క్యారెక్టర్లు కాకుండా నటించడానికి స్కోప్ ఉండే క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చెక్ సినిమా అలాంటిదే. ఈ సినిమాలో ఉరిశిక్ష పడిన ఖైదీగా నితిన్ కనిపిస్తున్నాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ వచ్చేశాయి. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశాడు. ట్రయిలర్ ప్రకారం చూస్తే.. నితిన్ అపర మేధావిలా కనిపిస్తున్నాడు. తన తెలివితేటలతో చెస్ లో
అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు. అయితే అప్పటికే అతడు ఓ దేశద్రోహి. ఉరిశిక్ష పడిన ఖైదీ. ఇలాంటి వ్యక్తిని విడిపించేందుకు లాయర్ గా రకుల్ ఎలా ప్రయత్నించింది, అసలు నితిన్ చేసిన తప్పేంటి అనేది చెక్ స్టోరీ
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ట్రయిలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా ఉంది. సెకెండ్ హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ నటించింది. ఫిబ్రవరి 19 లేదా 26న చెక్ సినిమాను
రిలీజ్ చేయబోతున్నారు.