నమిత నిజంగానే మందు కొడుతుందా?

హీరోయిన్ నమితపై కొన్నేళ్లుగా నడుస్తున్న పుకారు ఇది. ఆమె విపరీతంగా మద్యం సేవిస్తుందని, అందుకే ఆమె శరీర బరువు అదుపు తప్పిందనే ప్రచారం ఉంది. దీనిపై గతంలోనే ఓసారి వివరణ ఇచ్చిన నమిత, తాజాగా మరోసారి తన బరువుపై క్లారిటీ ఇచ్చారు. మద్యం సేవించడం వల్ల తను బరువు పెరగడం లేదని స్పష్టంచేసింది నమిత. తను థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నానని.. అందుకే బరువు పెరుగుతున్నానని బయటపెట్టింది. ప్రస్తుతం నమిత 97 కిలోల బరువు ఉందట. ఈ విషయాన్ని కూడా తనే బయటపెట్టింది. […]

Advertisement
Update:2021-02-04 06:41 IST

హీరోయిన్ నమితపై కొన్నేళ్లుగా నడుస్తున్న పుకారు ఇది. ఆమె విపరీతంగా మద్యం సేవిస్తుందని, అందుకే ఆమె శరీర బరువు అదుపు తప్పిందనే ప్రచారం ఉంది. దీనిపై గతంలోనే ఓసారి వివరణ ఇచ్చిన నమిత, తాజాగా మరోసారి తన బరువుపై క్లారిటీ ఇచ్చారు.

మద్యం సేవించడం వల్ల తను బరువు పెరగడం లేదని స్పష్టంచేసింది నమిత. తను థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నానని.. అందుకే బరువు పెరుగుతున్నానని బయటపెట్టింది. ప్రస్తుతం నమిత 97 కిలోల బరువు ఉందట. ఈ విషయాన్ని కూడా తనే బయటపెట్టింది.

బరువు పెరగడం వల్ల తను చాలా అవకాశాలు కోల్పోయానని, తీవ్రమైన ఒత్తిడికి లోనై ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని చెప్పుకొచ్చిన నమిత.. ప్రస్తుతం యోగాతో తను మనశ్శాంతిగా ఉన్నట్టు వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News