పుష్ప నుంచి లీకులే లీకులు

ఈ కాలం ఔట్ డోర్స్ లో షూటింగ్ చేస్తే ఏమౌతుందో అందరికీ తెలిసిందే. సినిమాకు సంబంధించిన స్టిల్స్ కుప్పలుతెప్పలుగా లీక్ అయిపోతాయి. ఇవి చాలదన్నట్టు వీడియోలు కూడా వైరల్  అయిపోతాయి. గతంలో లవ్ స్టోరీ షూటింగ్ టైమ్ లో ఇలా చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కు వస్తున్న జనాల్ని నిలువరించడం యూనిట్ వల్ల కావడం లేదు. దీనికితోడు అందరూ తమ మొబైల్స్ లో పుష్ప షూటింగ్ ను […]

Advertisement
Update:2021-02-04 03:31 IST

ఈ కాలం ఔట్ డోర్స్ లో షూటింగ్ చేస్తే ఏమౌతుందో అందరికీ తెలిసిందే. సినిమాకు సంబంధించిన స్టిల్స్ కుప్పలుతెప్పలుగా లీక్ అయిపోతాయి. ఇవి చాలదన్నట్టు వీడియోలు కూడా వైరల్ అయిపోతాయి. గతంలో లవ్ స్టోరీ షూటింగ్ టైమ్ లో ఇలా చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది.

ఈ సినిమా షూటింగ్ కు వస్తున్న జనాల్ని నిలువరించడం యూనిట్ వల్ల కావడం లేదు. దీనికితోడు అందరూ తమ మొబైల్స్ లో పుష్ప షూటింగ్ ను కవర్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు ఓ పాట, ఓ ఫైట్ కు సంబంధించిన సన్నివేశాలు కొన్ని లీక్ అయ్యాయి.

షూటింగ్ స్పాట్ లో ఎలాగూ ఆపలేకపోయారు, కనీసం సోషల్ మీడియాలోనైనా ఈ వైరల్ వీడియోస్ ను ఆపుదామని ప్రయత్నించింది యూనిట్. కానీ వాళ్ల ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.
కుప్పలుతెప్పలుగా షూటింగ్ వీడియోలు అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. బన్నీ-రష్మికపై ఓ సాంగ్, బన్నీపై ఓ ఫైట్ ను తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న
ఈ సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News