సలార్ లో ఫ్రెష్ కాంబినేషన్

ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై చాన్నాళ్లుగా డిస్కషన్ నడుస్తోంది. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకున్నారు. ఈరోజు శృతిహాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందిస్తూ, సలార్ యూనిట్ లోకి సాదరంగా ఆహ్వానించారు. రీఎంట్రీ తర్వాత శృతిహాసన్ ఒప్పుకున్న పాన్-ఇండియా మూవీ ఇదే. ప్రభాస్-శృతిహాసన్ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా. […]

Advertisement
Update:2021-01-28 09:08 IST

ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ సలార్. ఈ భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై చాన్నాళ్లుగా డిస్కషన్ నడుస్తోంది. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకున్నారు.

ఈరోజు శృతిహాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందిస్తూ, సలార్ యూనిట్ లోకి సాదరంగా ఆహ్వానించారు. రీఎంట్రీ తర్వాత శృతిహాసన్ ఒప్పుకున్న పాన్-ఇండియా మూవీ ఇదే.

ప్రభాస్-శృతిహాసన్ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కేజీఎఫ్-2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇదే. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని పాత్రలకు ఆడిషన్స్ పూర్తిచేశారు.

Tags:    
Advertisement

Similar News